ఏడాదిలో రూ. 493 నుంచి రూ. 4,978
నిన్న ఈ షేర్ లోయర్ సీలింగ్ వద్ద అంటే రూ . 4200 ప్రాంతంలో చాలా సేపు ఉంది. ఈ కౌంటర్లో వస్తున్న నాన్‌స్టాప్ ర్యాలీ చూసి కంగుతిన్న ఇన్వెస్టర్లు వెంటనే కొనుగోళ్ళకు సాహసించలేదు. కాని కేవలం గంటలో ఈ షేర్ మళ్ళీ గరిష్ఠ స్థాయిని తాకి రూ. 4740 వద్ద ముగిసింది. ఇవాళ మళ్ళీ 5 శాతం అప్పర్ సీలింగ్‌తో రూ. 4977.5 వద్ద ముగిసింది. కేవలం 18 నెలల్లో రూ. 163 నుంచి రూ. 4978ని తాకిన ఈ2ఈ నెట్వర్క్స్ ఇపుడు ఐటీ కంపెనీల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏఐ రంగంలో పైగా ఎన్విడియా హెచ్200 టెన్సర్ కోర్ జీపీయూపై శిక్షణ ఇచ్చే ఏకైక సంస్థ ఇది. ఏఐ టెక్నాలజీతో క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఓ సంచలనం. అడ్వాన్స్ క్లౌడ్ జీపీయూలు అందించే టాప్ కంపెనీ అయిన ఈ2ఈలో 21 శాతం వాటా కొనుగోలు చేసినట్లు ఎల్ అండ్ టీ ప్రకటించింది. సోమవారం నాటి క్లోజింగ్ ధరతో పోలిస్తే 24 శాతం డిస్కౌంట్‌తో ఎల్ అండ్ టీకి రూ. 3622ల ధరతో 29.79 లక్షల షేర్లను ఈ2ఈ కేటాయించింది. ఇది కంపెనీలో 15 శాతానికి సమానం. దీని కోసం ఎల్ అండ్ టీ రూ. 1079 కోట్లు వెచ్చించనుంది.మళ్ళీ 43 శాతం డిస్కౌంట్‌తో రూ. 2750 ధరకు కంపెనీ ఇవ్వనుంది. దీని కోసం ఎల్ అండ్ టీ మరో రూ. 328 కోట్లు వెచ్చినుంది. ఈ రెండు కేటాయింపులను ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ ద్వారా కేటాయించనున్నారు. దీంతో కంపెనీలో ఎల్ అండ్ టీకి 21 శాతం వాటా రానుందున.. కంపెనీ బోర్డులో ఇద్దరు డైరెక్టర్ల వరకు నియమించే హక్కు ఎల్ అండ్ టీకి దక్కనుంది. గడచిన 12 నెలల్లో 800 శాతం పెరిగిన ఈ షేర్ ఇవాళ కూడా అప్పర్ సీలింగ్‌లో క్లోజైంది. చూస్తుంటే రేపు కూడా అప్పర్ సీలింగ్లోనే ప్రారంభం అయ్యే అవకాశం కూడా ఉంది.