For Money

Business News

సూచీలు నిలబడ్డాయి కానీ…

ఇవాళ సూచీలు స్థిరంగా ముగిశాయి. కాని అనేక షేర్లు భారీ నష్టాలతో ముగిశాయి. కొన్ని బ్లూచిప్‌ కంపెనీలు 52 వారాల కనిష్ఠ స్థాయికి చేరుతున్నాయి. నిఫ్టి ఇవాళ కేవలం 5 పాయింట్ల నష్టంతో అంటే దాదాపు క్రితం ముగింపు స్థాయి 24141 వద్దే ముగిసింది. ఇక సెన్సెక్స్‌ పది పాయింట్ల లాభంతో ముగిసింది. ఒక్క ఐటీ, బ్యాంకు సూచీలు మినహా… దాదాపు ప్రధాన సూచీలన్నీ నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఫలితాలు బాగా లేని కంపెనీలు భారీగా నష్టపోయాయి. మిడ్‌ క్యాప్‌,స్మాల్‌ క్యాప్‌ షేర్లలో అమ్మకాల జోరు కొనసాగుతోంది. మార్కెట్‌ దశ, దిశ లేకుండా సాగుతోంది. ఇది పూర్తిగా డ్రే ట్రేడర్స్‌ మార్కెట్‌గా మారిపోయింది. పడితే స్వల్ప లాభాలకు అమ్ముకునే ఛాన్స్‌ లేదా పెరిగితే అమ్ముకుని స్వల్ప లాభాలతో బయటపడే ఛాన్స్‌ ఇపుడు మార్కెట్‌ ఇస్తోంది.ఉదయం నష్టాల్లో ప్రారంభమైనా… పదిన్నరకల్లా లాభాల్లోకి వచ్చింది. 11గంటలకల్లా గరిష్ఠ స్థాయిని తాకింది. అక్కడి నుంచి పడుతూ వచ్చింది. దిగువస్థాయిలో మద్దతు అందడంతో పతనం ఆగింది. గత కొన్ని రోజుల నుంచి పడుతూ వచ్చిన ట్రెంట్‌ ఇవాళ లాభాలతో ముగిసింది. నిఫ్టి షేర్లలో పవర్‌ గ్రిడ్‌ ఇవాళ టాప్‌లో ఉండగా, తరవాతి స్థానాల్లో ట్రెంట్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా ఉన్నాయి. ఇక నష్టాలతో ముగిసిన షేర్లలో ఏషియన్‌ పెయింట్‌ 8 శాతం నష్టంతో టాప్‌లో ఉంది. తరవాతి స్థానాల్లో బ్రిటానియా, అపోలో హాస్పిటల్స్‌, సిప్లా, ఓఎన్‌జీసీ ఉన్నాయి.

Leave a Reply