For Money

Business News

మంచి శకునములే…

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ ముందంజలో ఉన్నారు. ట్రంప్‌ గెలుపు ఖాయమని ట్రెండ్స్‌ తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లు ముఖ్యంగా వాల్‌స్ట్రీట్‌ భారీ లాభాల్లో ట్రేడవుతోంది. రాత్రి అన్ని ప్రధాన సూచీలు ఒక శాతం లాభంతో క్లోజ్‌ కాగా, ఇవాళ ఫ్యూచర్స్‌ కూడా భారీ లాభాల్లో ఉన్నాయి. నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు ఒకటిన్నర శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. అలాగే ఆసియా మార్కెట్లు కూడా దూసుకుపోతున్నాయి. ఒక్క హాంగ్‌కాంగ్‌ మినహా మిగిలిన సూచీలన్నీ ఆకర్షణీయ లాభాల్లో ఉన్నాయి. ఉదయం ఆరంభంలో 70 పాయింట్ల నష్టంలో ఉన్న గిఫ్ట్‌ నిఫ్టి ఇపుడు గ్రీన్‌లోకి వచ్చింది. నిఫ్టి ఇవాళ గ్రీన్‌లో ఓపెనయ్యే ఛాన్స్‌ ఉంది. ఇవాళ బ్యాంక్‌ షేర్లకు వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉంది. రేపు నిఫ్టి క్లోజింగ్‌. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో షార్ట్‌ కవరింగ్‌ వచ్చే ఛాన్స్‌ అధికంగా ఉంది.