For Money

Business News

హిందాల్కో జోష్‌

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆదిత్య బిర్లా కంపెనీ హిందాల్కో అద్భుత పనితీరు కనబర్చింది. కంపెనీ ఫలితాలు మార్కెట్‌ అంచనాలను మించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 21,350 కోట్ల ఆదాయంపై రూ. 1250 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని సీఎన్‌బీఐ టీవీ18 నిర్వహించిన సర్వేలో విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే కంపెనీ రూ. 22,262 కోట్ల ఆదాయంపై రూ. 1891 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 20676 కోట్ల ఆదాయంపై రూ. 847 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఆ విధంగా చూస్తే కంపెనీ నికర లాభం భారీగా పెరిగింది. కంపెనీ మార్జిన్‌ కూడా అంచనాలకు మంచి 12.4గా నమోదైంది.

Leave a Reply