రూ. 5600 పెరిగిన వెండి
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు భారీగా పెరగడం, స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల జోరు అధికంగా ఉండటంతో రూపాయి ఆల్‌టైమ్ కనిష్టానికి పడిపోయింది. దీంతో ఒక్కసారిగా బులియన్ మార్కెట్లో ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో బులియన్ ధరలు స్థిరంగా ఉన్నా… మన మార్కెట్లో ధరలు పెరగడానికి కారణం కరెన్సీ వీక్ కావడమే. ఇవాళ ఉదయం ఆరంభంలోనే కిలో వెండి ధర రూ. 5600 దాకా పెరిగి రూ. 2,25,014లకు చేరింది. అదే సమయంలో బంగారం కూడా స్వల్పంగా అంటే రూ. 1,650 పెరిగింది. దీంతో ఎంసీఎక్స్‌లో పది గ్రామలు బంగారం ధర రూ. 1,44,169లకు చేరింది. ఇక స్పాట్ మార్కెట్లో ఈ ధరలు మరింత అధికంగా ఉండే అవకాశముంది.
