కిమ్స్ షేర్లు రేపు కొనొచ్చా?
నష్టాలతో ఇన్వెస్టర్లను బెంబేలెత్తిస్తున్న ప్రస్తుత తరుణంలో హైదరాబాద్‌కు చెందిన కిమ్స్ హాస్పిటల్స్ షేరును కొనుగోలు చేయొచ్చని టెక్నికల్ అనలిస్టులు అంటున్నారు. డైలీ చార్ట్‌లలో ఈ షేర్ అప్ ట్రెండ్‌ను సూచిస్తోందని… ప్రస్తుత ధర అంటే రూ. 570 ప్రాంతంలో ఈ షేర్‌ను కొనుగోలు చేయొచ్చని బొనంజా బ్రోకింగ్ సంస్థకు చెందిన టెక్నికల్ అనలిస్ట్ విరాట్ జగాడ్ సూచించారు. ఆయన సలహాలను ఎకనామిక్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. రూ. 544 స్టాప్‌లాస్‌తో రూ. 620 టార్గెట్‌తో కిమ్స్ హాస్పిటల్స్‌ను కొనుగోలు చేయొచ్చని ఆయన సిఫారసు చేశారు. అలాగే ఐటీ రంగానికి చెందిన నెట్‌వెబ్ టెక్నాలజీస్ షేర్‌ను కూడా కొనుగోలు చేయొచ్చని ఆయన సలహా ఇచ్చారు. డైలీ చార్ట్స్‌లో ఈ షేర్ బ్రేకౌట్ ఇస్తోందని.. ప్రస్తుత ధర రూ. 2838 వద్ద ఈ షేర్‌ను కొనుగోలు చేయొచ్చని అన్నారు. రూ. 2790ల స్టాప్‌లాస్‌తో రూ. 3000 టార్గెట్ కోసం కొనొచ్చిన విరాట్ సలహా ఇచ్చారు. అలాగే ప్రముఖ బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ షేర్‌ను కూడా రూ. 997 ప్రాంతంలో కొనుగోలు చేయొచ్చని… తక్షణ టార్గెట్ రూ. 1100గా ఆయన తెలిపారు. అయితే ఇన్వెస్టర్లు రూ. 950ను స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలని అన్నారు. ఇక జూబ్లియంట్ ఫుడ్ వర్క్ షేర్‌ను రూ. 660 టార్గెట్ కోసం కొనుగోలు చేయొచ్చని, అయితే స్టాప్‌లాస్ రూ. 580గా పెట్టుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం ఈ షేర్ రూ. 607 వద్ద ట్రేడవుతోంది. చివరగా చాలెట్ షేర్‌ను రూ. 975 టార్గెట్‌తో కొనుగోలు చేయొచ్చని తెలిపారు. ఇపుడు ఈ షేర్ రూ. 892 వద్ద ఉంది. స్టాప్‌లాస్ రూ. 850ని మాత్రం ఇన్వెస్టర్లు గుర్తు పెట్టుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.
(ఈ షేర్ల సలహాలు టెక్నికల్ నిపుణులు ఇచ్చినవి. సొంతంగా మీరు పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు మీ మనీ మేనేజర్‌ను సంప్రదించడం మర్చిపోవద్దు)