దరఖాస్తు చేశారా? అలాట్‌మెంట్ మీకే
అసలే సెకండరీ మార్కెట్‌లో కష్టకాలం. పైగా భారీ ప్రీమియం. అయినా స్విగ్గీ ఐపీఓ ఊపిరి పీల్చుకుంది. సబ్‌స్క్రయిబ్ అయినట్లనిపించింది. ఎట్టకేలకు స్విగ్గీ ఐపీఓ 3.59 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. రీటైల్ ఇన్వెస్టర్లకైతే… దాదాపు దరఖాస్తు చేసినవారందరికీ షేర్లు అలాట్ కానున్నాయి. ఎందుకంటే రీటల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన కోటా 1.11 రెట్లు మాత్రమే ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయింది. గ్రేమార్కెట్‌లో ఈ ఆఫర్‌కు పెద్దగా ప్రీమియం లేకపోవడంతో సాధారణ ఇన్వెస్టర్లు ఈ ఇష్యూ పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. క్వాలిఫైడ్ ఇన్‌స్టట్యూషనల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన కోటా మాత్రం 6.02 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అంది. దీంతో నాన్ ఇన్‌స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కోటా కేవలం 0.41 శాతమే సబ్‌స్క్రయిబ్ అయినా… మొత్తానికి ఇష్యూ మూడు రెట్లుపైగా ఆదరణతో గట్టెక్కింది. స్విగ్గీ ఒక్కో షేర్‌ను రూ. 390కి కేటాయించనుంది. కంపెనీ షేర్ ధర ఆకర్షణీయంగా లేకున్నా… ధర అధికం కాదని అనలిస్టులు అంటున్నారు. ప్రీమియం పెద్దగా రాకున్నా… క్షీణించే అవకాశాలు తక్కువని చెబుతున్నారు. ఈనెల 13న ఈ ఆఫర్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ కానుంది.