మార్కెట్‌పై సీపీఐ డేటా ఎఫెక్ట్
నిన్న నష్టాల్లో ముగిసిన వాల్‌స్ట్రీట్ ఇవాళ గ్రీన్‌లో ఉంది. ఇవాళ వచ్చిన సీపీఐ డేటా మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది. సీపీఐ డేటా మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉన్నా… ఆహారం, వైద్యం ఖర్చులు పెరుగుతూనే ఉన్నట్లు ఈ డేటా తేల్చింది. దీంతో ఫెడరల్ రిజర్వ్ వచ్చే సమావేశంలో కూడా వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న ఆశలు పెరిగాయి. ఈ డేటా తరవాత బాండ్ ఈల్డ్స్‌తో పాటు డాలర్ పెరిగింది. ఇపుడు డాలర్ ఇండెక్స్ 7 నెలల గరిష్ఠ స్థాయి 106పైన ట్రేడవుతోంది. డౌజోన్స్ 0.37 శాతం లాభంతో ఉంది. ఎస్ అండ్ పీ 0.2 శాతం లాభంతో ఉండగా నాస్డాక్ క్రితం స్థాయి వద్దే ట్రేడవుతోంది. మరి లాభాలు చివరిదాకా కొనసాగుతాయా అన్నది చూడాలి. మరోవైపు క్రూడ్ ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ 72 డాలర్ల వద్దే ఉంటోంది. ఇక బులియన్ ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. ఔన్స్ స్టాండర్డ్ బంగారం ధర 2600 డాలర్ల వద్దే ట్రేడవుతోంది.