For Money

Business News

లాభాల్లోనే డౌజోన్స్‌

ఫెడ్‌ వడ్డీ రేట్ల నిర్ణయం తరవాత ఎకానమీ షేర్లలో ర్యాలీ కొనసాగుతోంది. నిన్న భారీగా పెరిగిన వాల్‌స్ట్రీట్‌ సూచీలు ఇవాళ కూడా జోరుపై ఉన్నాయి. ఐటీ, టెక్‌ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నాస్‌డాక్‌ మాత్రం స్థిరంగా దాదాపు క్రితం వద్దే ట్రేడవుతోంది. మిడ్‌సెషన్‌లో ఈ సూచీ కూడా గ్రీన్‌లోకి వస్తుందేమో చూడాలి. ఇక ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.35 శాతం, డౌజోన్స్‌ సూచీ 0.6 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. అనేక బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థల షేర్లు ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. ట్రంప్‌ వచ్చిన తరవాత డాలర్‌ బాగా బలపడుతోంది. నిన్న స్వల్ప ఒత్తిడికి లోనైనా.. ఇవాళ మళ్ళీ లాభాలతో ట్రేడవుతోంది. డాలర్‌ ఇండెక్స్ మళ్ళీ 105 వైపు పరుగులు పెడుతోంది. డాలర్‌ పెరగడంతో బులియన్‌ మార్కెట్‌ జోరు తగ్గింది. ఔన్స్‌ బంగారం ధర 2700 డాలర్ల దిగువకు వచ్చేసింది. ప్రస్తుతం 2694 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా ఒక శాతంపైగా నష్టంతో ఉంది. హరికేన్‌ వల్ల ఆయిల్‌ సరఫరాలో అంతరాయ కల్గుతుందని తొలుత భావించినా… అలాంటి ప్రమాదం లేదని తేలడంతో క్రూడ్‌ ధరలు క్షీణించాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 74 డాలర్ల దిగువన ట్రేడవుతోంది.

Leave a Reply