For Money

Business News

ట్రంప్‌ క్యాబినెట్‌లో మార్పులు?

ఇరాన్‌ యుద్ధం అమెరికా రాజకీయాలను తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ఈ యుద్ధం కారణంగా అమెరికాలో ట్రంప్‌ జానాదరణ నానాటికి పడిపోతోంది. ఈ మొత్తం వ్యవహారం కలగాపులం కావడంతో తన కేబినెట్‌ను పునర్‌ వ్యవస్థీకరించాలని అధ్యక్షుడు ట్రంప్‌ భావిస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం రాయిటర్స్‌ వార్తా సంస్థ పేర్కొంది. హర్ముజ్‌ జల సంధి విషయంలో 48 గంటల గడువు అమెరికా ఇచ్చింది. ఈలోగా ఇరాన్‌ డోంట్‌ కేర్‌ అనడంతో అమెరికా పరువు పోతోంది. చూస్తుంటే అమెరికా తనకు 48 గంటల గడువు కావాలని ఇరాన్‌ను అభ్యర్థించే విధంగా పరిస్థితి మారింది. అమెరికా గడువు కోరితే… ఇరాన్‌ నో చెప్పినట్లుగా ప్రస్తుతం పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇరాన్‌ యుద్ధంతో అమెరికాలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. కీలక సమయంలో ఆర్మీ చీఫ్‌పై వేటు వేయగా, పలువురు సీనియర్‌ అధికారులు అమెరికా వైఖరిని తప్పు పడుతున్నారు. మరోవైపు నల్లజాతీయులైన సీనియర్‌ అధికారులకు ఆర్మీలో ప్రమోషన్‌ ఆపేశారన్న వార్త కూడా ఇపుడు వైరల్‌ అవుతోంది. ఈ మొత్తం నేపథ్యంలో కేబినెట్‌లో మార్పుల తేవానలి ట్రంప్‌ భావిస్తున్నట్లు రాయిటర్స్‌ అంటోంది. డైరెక్టర్‌ ఆఫ్‌ నేషనల్ ఇంటెలిజెన్స్‌ తులసి గబ్బార్డ్‌తో పాటు వాణిజ్య మంత్రి హొవర్డ్‌ లత్నిక్‌పై కూడా వేటు పడే అవకాశముందని భావిస్తున్నారు. నవంబర్‌లో మధ్యంతర ఎన్నికలు ఉన్నందున… ఇప్పటి నుంచే ప్రక్షాళన జరగాలని ట్రంప్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply