For Money

Business News

అమితాబ్‌, రాహుల్‌, మాధురీ కొన్నారు

ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ కంపెనీ అయిన స్విగ్గీ ఐపీఓ వచ్చే వారం ప్రారంభం కానుంది. మార్కెట్‌ నుంచి రూ.11,327 కోట్లు సమీకరించేందుకు ఉద్దేశించిన ఈ ఐపీఓ ఈనెల 6న ప్రారంభమై 8న ముగుస్తుంది. షేర్ల ధరల శ్రేణి రూ.371-390. ఈ పబ్లిక్‌ ఆఫర్‌ కింద తాజాగా షేర్లను జారీ చేయడం ద్వారా రూ.4,499 కోట్లను సమీకరిస్తుండగా, ప్రస్తుత ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న వాటాలో కొంత భాగాన్ని అంటే 17.5 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఈ పబ్లిక్‌ ఆఫర్‌లో ఇప్పటికే మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రావిడ్‌, జహీర్‌ ఖాన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ రోహన్‌ బొపన్న, బాలీవుడ్‌ నుంచి కరణ్‌ జోహర్‌, అమితాబ్‌ బచ్చన్‌, మాధురీ దీక్షిత్‌ కూడా ప్రి ఐపీఓ రౌండ్‌లో స్విగ్గి షేర్లను కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. పబ్లిక్‌ ఆఫర్‌కు ముందు సెకండరీ మార్కెట్‌ను కొనే వెసులు బాటు ఉంది. ఈ కంపెనీలో మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు చెందిన రాందేవ్‌ అగర్వాల్‌ కూడా వాటా కొన్నారు. ఇక ఐపీఓ కింద దరఖాస్తు చేసే కంపెనీ ఉద్యోగులకు ఒక్కో షేర్‌పై రూ. 25 మేర డిస్కౌంట్‌ను కంపెనీ ఇవ్వనుంది.

Leave a Reply