For Money

Business News

LEVELS: లక్ష్మణ రేఖ 18550

నిఫ్టిలో ఇవాళ కూడా ఒత్తిడి కొనసాగనుంది. సింగపూర్ నిఫ్టి స్థాయిలో నిఫ్టికి ఒక మోస్తరు నష్టాలు తప్పేలా లేవు. అయితే క్రూడ్‌ ధరలు తగ్గడం, అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ దృష్ట్యా ఇవాళ బ్యాంకులు రాణించే అవకాశముంది. నిఫ్టికి ఇవాళ 18600 ప్రాంతంలో మద్దతు లభించవచ్చని సీఎన్‌బీసీ ఆవాజ్‌ న్యూస్‌ ఛానల్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌ అనూజ్‌ సింఘాల్ అంటున్నారు. కాబట్టి బై ఆన్‌ డిప్స్‌ పద్ధతి పాటించే ఇన్వెస్టర్లు 18550 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని కొనుగోలు చేయొచ్చని సలహా ఇచ్చారు. రాత్రి నాస్‌డాక్‌లో గట్టి అమ్మకాల ఒత్తిడి వచ్చింది. మన దగ్గర కూడా ఐటీ షేర్లు పడొచ్చు. కాని ఈ సూచీలు ఇప్పటికే దిగువ స్థాయిలో ఉన్నందున… రికవరీ వస్తే చాలా స్పీడ్‌గా వచ్చే అవకాశముంది. సో.. 18550 స్టాప్‌లాస్‌తో 18600, 18640 మధ్య కొనుగోలు జోన్‌ అని అనలిస్టులు అంటున్నారు.