For Money

Business News

బులియన్‌ కొనసాగుతున్న ర్యాలీ

అమెరికా, ఇరాన్‌ మధ్య శాంతి చర్చలు ప్రారంభానికి ఒకవైపు ప్రయత్నాలు సాగుతుండగా, మరోవైపు డాలర్‌ బలంగా ఉంటోంది. స్టాక్‌ మార్కెట్లన్నీ లాభాల్లో ఉండగా, క్రూడ్‌ మాత్రం అయిదు శాతం తగ్గింది. పశ్చిమాసియాలో శాంతి వాతావరణం ఏర్పడుతుందన్న ఆశలతో బులియన్‌ మార్కెట్‌లో మళ్ళీ కొనుగోలు మొదలయ్యాయి. నిన్నటి నుంచి రికవరీ కొనసాగుతోంది. ఇవాళ ఎంసీఎక్స్‌లో బంగారం రూ. 5000 పైగా పెరగ్గా, వెండి రూ. 10000 లాభపడింది. పది గ్రాముల బంగారం ఎంసీఎక్స్‌లో రూ.1,44,125 వద్ద ట్రేడవుతండగా, కిలో వెండి రూ. 2,34,280 వద్ద ట్రేడవుతోంది.

Leave a Reply