For Money

Business News

లాభాలు స్వీకరించండి.. చాలు

ఇవాళ ఇప్పటికే పొజిషన్‌ తీసుకున్న వారు ఇవాళ ఓపెనింగ్‌లో లాభాలు స్వీకరించడం ఉత్తమమని అనలిస్టులు సూచిస్తున్నారు. నిఫ్టి 18000 స్థాయి దాటింది కాబట్టి… మార్కెట్‌ ముందుకు సాగుతుందనే అపోహ వొద్దని వీరు హెచ్చరిస్తున్నారు. ఇవాళ నిఫ్టి ఓపెనింగ్‌లోనే 18100ను దాటే అవకాశముంది… ఒకవేళ నిఫ్టి 18150ని చేరినా లాభాలు స్వీకరించాలని సూచిస్తన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఓపెనింగ్‌లోనూ కొనుగోలు చేయొద్దని హెచ్చరిస్తున్నారు. తరవాత నిఫ్టికి కొనేందుకు అవకాశం వస్తుందేమో చూడమని సలహా ఇస్తున్నారు. నిఫ్టి గనుక 18000 ప్రాంతానికివస్తే కొనుగోలు చేయొచ్చని సలహా ఇస్తున్నారు.రిస్క్‌ తీసుకునే వారు 18020 ప్రాంతంలో కూడా కొనొచ్చని అంటున్నారు. అయితే ఇవాళ్టి ట్రేడింగ్‌కు 17980ని స్టాప్‌లాస్‌గా పెట్టుకుని ట్రేడ్‌ చేయాలని సీఎన్‌బీసీ టీవీ18 మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనూజ్‌ సింఘాల్‌ సూచించారు. ఇవాళ నిఫ్టికి 18200 ప్రాంతంలో కచ్చితంగా గట్టి ప్రతిఘటన వస్తుందని ఆయన అంటున్నారు. సో… ఇవాళ్టి ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్న నిన్నటి పొజిషన్స్‌లో లాభాలు స్వీకరించమని సలహా. రెండోది.. పడితే కొనండి. లేదంటే ఇవాళ నో ట్రేడింగ్‌ అంటూ వొదిలేయడం. అధిక స్థాయిలో మాత్రం కొనుగోలు చేయొద్దు.