మరో కొత్త చరిత్ర
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన తరవాత డిజిటల్ కరెన్సీలు పట్టపగ్గాల్లేకుండా పెరుగుతున్నాయి. ముఖ్యంగా బిట్ కాయిన్ రోజుకో కొత్త ఆల్‌టైమ్ రికార్డు సృష్టిస్తోంది. ఇవాళ 4.7 శాతం పెరిగిన బిట్ కాయిన్ తొలిసారి 80వేల డాలర్లను దాటింది. తాను అధికారంలోకి వస్తే డిజిటల్ ఆస్తులకు సంబంధించి కొత్త చట్టాలను తేవడమే గాక… డిజిటల్ కరెన్సీ మార్కెట్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని ట్రంప్ హామి ఇచ్చారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడన్ మాత్రం డిజిటల్ కరెన్సీపై ఉక్కు పాదం మోపారు. ఈ ఏడాదిలో బిట్ కాయిన్ ఏకంగా 91 శాతం పెరిగింది. బ్లాక్ బాక్ ఇన్‌కార్పొరేటెడ్‌కు చెందిన ఐషేర్ బిట్‌కాయిన్ ట్రస్ట్‌కు చెందిన ఈటీఎఫ్‌లకు ఇన్వెస్టర్ల నుంచి భారీగా నిధులు వచ్చి పడుతున్నాయి. రోజుకు కనీసం 140 డాలర్లు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.