For Money

Business News

బ్యాంకు షేర్లకు డిమాండ్‌

వాల్‌స్ట్రీట్‌లో నాన్‌స్టాప్‌ ర్యాలీ కొనసాగుతోంది. ఎన్నికల్లో ట్రంప్‌ గెలిచిన తరవాత ఐటీ, టెక్‌ కన్నా ఎకానమీ షేర్లు బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగానికి చెందిన షేర్లకు భారీ డిమాండ్‌ వస్తున్నట్లు గోల్డ్‌ మ్యాన్‌ శాచ్స్‌ పేర్కొంది. రెన్యూవబుల్‌ ఎనర్జీ స్టాక్స్‌లో గట్టి అమ్మకాల ఒత్తిడి వచ్చిందని, అయితే బ్యాంకుల షేర్లకు డిమాండ్‌ పెరుగుతోందని ఈ సంస్థ ఒక నివేదికలో పేర్కొంది. ట్రంప్‌ జమానాలో బ్యాంకింగ్‌ రంగంలో ఆంక్షలు తగ్గుతాయని వీరు భావిస్తున్నారు. దీంతో డౌజోన్స్‌ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇవాళ కూడా డౌజోన్స్‌ 0.8 శాతం పెరగ్గా ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.24 శాతం పెరిగింది. నాస్‌డాక్‌ క్రితం ముగింపు వద్దే ఉంది. ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ ఇవాళ కూడా బాగా పెరిగింది. డాలర్‌ ఇండెక్స్‌ 105.44ని చేరింది. దీని ప్రభావం కమాడిటీస్‌ మార్కెట్‌లో బాగా కన్పిస్తోంది. ఇవాళ క్రూడ్‌ ఆయిల్‌ ధరలు మూడు శాతం మేర క్షీణించాయి. అలాగే బంగారం, వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఔన్స్‌ బంగారం ధర 2600 డాలర్ల దిగువకు పడుతుందో అన్న అనుమానం మార్కెట్‌లో వ్యక్తం అవుతోంది.

Leave a Reply