అదానీకి కెన్యా షాక్
అమెరికా షాక్ నుంచి అదానీ ఇంకా కోలుకోకముందే కెన్యా మరో షాక్ ఇచ్చింది. తమ దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి కోసం ఉద్దేశించిన అదానీ కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. అలాగే కెన్యాలో ట్రాన్స్ మిషన్ లైన్లు వేసేందుకు అదానీ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు కెన్యా అధ్యక్షుడు విలియం రూటో వెల్లడించారు.
సుమారు 70 కోట్ల డాలర్లు అంటే రూ. 6000 కోట్ల కాంట్రాక్ట్ అదానీ చేతి నుంచి చేజారింది. అదానీతో కుదుర్చుకున్న,కుదుర్చుకోనున్న కాంట్రాక్టులను రద్దు చేయాల్సందిగా ఇంధన వనరుల శాఖ, పెట్రోలియం శాఖతో పాటు రవాణా శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. తమ భాగస్వామ్య దేశాల నుంచి సమాచారంతో పాటు తమ దేశ దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు రూటో తెలిపారు.