For Money

Business News

యూజర్లకు అమెజాన్‌ షాక్‌..

ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌కు చెందిన అమెజాన్‌ ప్రైమ్‌ యూజర్లకు షాక్‌ ఇచ్చింది. సబ్‌స్క్రిప్షన్‌ ధరలు భారీగా పెంచేసింది. నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ఏకంగా 67 శాతం పెంచినట్లు అమెజాన్‌ ప్రైమ్‌ వెల్లడించింది. అలాగే త్రైమాసిక ప్లాన్‌నూ పెంచేసింది. వార్షిక ప్లాన్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. పెరిగిన సబ్‌స్క్రిప్షన్‌ టారిఫ్‌లు తక్షణం అమల్లోకి వస్తాయని అమెజాన్‌ ప్రైమ్‌ తెలిపింది. అమెజాన్‌ ప్రైమ్‌ నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ ప్రస్తుతం రూ.179 కాగా, దీనన్ఇ రూ.299లకు పెంచారు. అలాగే మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌ చార్జీని రూ.459 నుంచి 599 చేశారు. వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ మాత్రం రూ.1499 వద్దే కొనసాగనుంది. అలాగే రూ.999లకే అమెజాన్‌ లైట్‌ వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ పొందొచ్చని తెలిపింది.