For Money

Business News

రూ. 16,000 కోట్లకు అమ్మేశారు

ఐపీఎల్‌ టీమ్‌ రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ను యునైటెడ్‌ స్పిరిట్స్‌ కంపెనీ అమ్మేసింది. రూ. 16,000 కోట్లకు డీల్‌ కుదిరినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఆదిత్య బిర్లా గ్రూప్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌, బోల్ట్‌ వెంచర్స్‌తో పాటు బ్లాక్‌స్టోన్‌ ఉన్న కన్సార్టియం ఆర్సీబీని కొనుగోలు చేసింది. కన్సార్టియంకు అర్యమాన్‌ బిర్లా ఛైర్మన్‌గా ఉంటారు, వైస్‌ ఛైర్మన్‌గా సత్యన్‌ గజ్వాని ఉంటారు. ఐపీఎల్‌ టీమ్స్‌ తాజా వ్యాల్యుయేషన్‌ ప్రకారం ఈ డీల్‌ కుదిరినట్లు తెలుస్తోంది. 2008లో ఆర్సీబీ జట్టు విలువ 11.16 కోట్ల డాలర్లు కాగా, ఇపుడు 178 కోట్ల డాలర్లకు పెరగడం విశేషం. గత ఏడాది కొనుగోలు చేసిన గుజరాత్‌ టైటాన్స్‌కు దాదాపు రెట్టింపు మొత్తం ఆర్సీబీకి లభించింది. రాజస్థాన్‌ రాయల్స్‌ వ్యాల్యూయేషన్‌ 160 కోట్ల డాలర్లుగా లెక్కించారు.

అమెరికాకు చెందిన ప్రముఖ టెక్‌ వ్యాపారవేత్త కల్‌ సోమని నేతృత్వంలోని కన్సార్షియం సుమారు రూ.15,300 కోట్లకు రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసింది. సోమనితో పాటు ‘వాల్‌మార్ట్‌’కు చెందిన రాబ్‌ వాల్టన్, ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ యజమాని హాంప్‌ కుటుంబం ఈ కన్సార్షియంలో సభ్యులుగా ఉన్నారు.

Leave a Reply