అంతా అర గంటలోనే…
రోజంతా ఆకర్షణీయ లాభాల్లో ఉన్న నిఫ్టి చివరి అరగంటలో మెజారిటీ లాభాలను కోల్పోయింది. దాదాపు క్రితం ముగింపు వద్దే ప్రారంభమైన నిఫ్టి మిడ్‌సెషన్‌కల్లా 23780 పాయింట్ల స్థాయి అంటే 300 పాయింట్లకు పైగా లాభపడింది. అనేక షేర్లు చాలా రోజుల తరవాత గ్రీన్‌లోకి వచ్చాయి.23500 స్థాయి 200 రోజుల చలన సగటు కావడంతో… మార్కెట్‌కు ఇక్కడ మద్దతు లభించిందని భావించారు. అయితే చివరి అర గంటలో అంటే 2.45 నుంచి 3.15 మధ్య అనేక మంది ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించారు. దీనికి ప్రధాన కారణం.. యూరప్ మార్కెట్లతో పాటు అమెరికా మార్కెట్లు భారీ నష్టాల్లో ఉండటం. అలాగే రేపు మార్కెట్‌లకు సెలవు కావడంతో రిస్క్ వొద్దనుకున్న ఇన్వెస్టర్లు అధిక స్థాయిల వద్ద బయటపడ్డారు. పైగా రేపు రాత్రికి మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎగ్జిట్ పోల్ కూడా రానున్నాయి. ఎన్నికల ఫలితాల కంటే అంతర్జాతీయ మార్కెట్లలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్‌తో చాలా మంది ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించినట్లు కన్పిస్తోంది. దాదాపు ప్రధాన సూచీలన్నీ ఇవాళ లాభాల్లో క్లోజ్ కావడం ఒక విశేషం. డాలర్ ఏడాది గరిష్ఠానికి చేరగా, రూపాయి ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఎగుమతి ప్రధాన రంగాలైన ఫార్మా, ఐటీ షేర్లలో కూడా అంతంత మాత్రమే ఆసక్తి వ్యక్తం అవుతోంది. మరోవైపు ఇవాళ 2870 షేర్లు ట్రేడ్‌కాగా, 1116 షేర్లు నష్టాల్లో క్లోజయ్యాయి. 1687 షేర్లు లాభాల్లో క్లోజ్ కావడం విశేషం. పలు బ్లూచిప్ షేర్లలో షార్ట్ కవరింగ్ వచ్చింది. ఉదయం నుంచి నిఫ్టి గెయినర్స్‌లో టాప్‌లో ఉన్న ట్రెంట్ చివర్లో వచ్చిన ఒత్తిడికి రెండు శాతం లాభంతో సరిపెట్టుకుంది. ఇక టాప్ గెయినర్‌గా ఎం అండ్ ఎం నిలిచింది. తరవాతి స్థానాల్లో టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఐషర్ మోటార్స్ నిలిచాయి. ఇవాళ ఇన్సూరెన్స్ కంపెనీల్లో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. నిఫ్టి టాప్ లూజర్స్‌లో ఎస్‌బీఐ లైఫ్ నిలిచింది. తరువాతి స్థానాల్లో హిందాల్కో, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ నిలిచాయి. నిఫ్టిలో 27 షేర్లు నష్టాల్లో ముగిశాయి.