For Money

Business News

స్థిరంగా ప్రారంభం

స్టాక్‌ మార్కెట్‌ నిలకడగా ట్రేడవుతోంది. ఆరంభంలో నిఫ్టి 23606 పాయింట్లను తాకిన తరవాత ఇపుడు 23515 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మిడ్‌ క్యాప్‌ షేర్లలో ఇంకా ఒత్తిడి కన్పిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల జోరు తగ్గింది. ఒక మోస్తరు అమ్మకాలు మాత్రమే జరుగుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లకు చైనాపై ఆసక్తి తగ్గిందని సీఎల్‌ఎస్‌ఏ వంటి బ్రోకింగ్‌ రీసెర్చి సంస్థలు నోట్‌లు జారీ చేశాయి. భారత మార్కెట్లను 20 శాతం ఓవర్‌ వెయిటేజీ ఇస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశాయి. ఇపుడు ఈ నోట్‌ స్టాక్‌ మార్కెట్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. దీంతో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల హోరు మరింత తగ్గవచ్చిన మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. మెటల్స్‌ షేర్లు ఇవాళ వెలుగులో ఉన్నాయి. చాలా రోజుల తరవాత ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ కన్పిస్తోంది.

Leave a Reply