For Money

Business News

ఈ షేరు 36% పెరుగుతుంది

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికం ఫలితాల తరవాత హ్యుందాయ్‌ మోటార్ ఇండియా షేర్‌ రూ. 1745 వద్ద ముగిసింది. గత నెల 22న 1970ని తాకిన ఈ షేర్‌ ఇవాళ ఏకంగా 3.27 శాతం క్షీణించింది. నిజానికి ఈ షేర్‌ ఇవాళ రూ. 1714 స్థాయిని కూడా తాకింది. అయితే ఈ షేర్‌లో డెలివరీ శాతం 50 శాతంపైగా ఉండటం విశేషం. దీనికి ప్రధాన కారణం పలు బ్రోకింగ్‌ సంస్థలు ఈ షేర్‌ను కొనుగోలు చేయమని సిఫారసు చేయడమే. ఇవాళ్టి ధర నుంచి 36 శాతం వరకు అంటే రూ. 2472లకు ఈ షేర్‌ పెరిగే ఛాన్స్‌ ఉందని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ నొమురా అంటోంది. ప్రస్తుతం త్రైమాసికంలో కంపెనీ ఎబిటా మార్జిన్‌ తాము అనుకున్న స్థాయిలో ఉందని, డిస్కౌంట్‌లు అధికంగా ఇవ్వకపోవడంతో కంపెనీ నికర లాభం ఆశించినస్థాయిలో ఉందని నొమురా పేర్కొంది. 2025-27కల్లా కంపెనీ 17 శాతం కాంపౌండ్‌ వార్షిక వృద్ధి రేటు సాధిస్తుందని నొమురా అంచనా వేస్తోంది. దీనికి కారణం కొత్త కెపాసిటీ అందుబాటులోకి రావడమేనని పేర్కొంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో హ్యుందాయ్‌ మోటార్స్‌ రూ. 17260 కోట్ల టర్నోవర్‌పై రూ. 1375 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.

Leave a Reply