నష్టాలు పెరిగినట్లా? తగ్గినట్లా?
సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో వోడాఫోన్ ఐడియా నష్టాలు రూ. 7176 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంలోని నష్టాలు రూ. 8738 కోట్లతో పోలిస్తే ఈ క్వార్టర్‌లో తగ్గినట్లే. కాని ఇంతకుమునుపు క్వార్టర్‌తో పోలిస్తే పెరిగినట్లే. ఎందుకంటే జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నష్టాలు కేవలం 6,432 కోట్లు మాత్రమే. అయితే ఆదాయం మాత్రం స్వల్పంగా పెరిగి రూ. 10,932 కోట్లకు చేరాయి. ఎబిటా రూ. 4550 కోట్లని కంపెనీ తేల్చింది. క్యాష్ ఎబిటా మార్జిన్ కంపెనీల విలీనం తరవాత అత్యధికంగా అంటే 2320 కోట్లకు చేరింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణ మొత్తం రూ. 4580 కోట్లు తగ్గినట్లు తెలిపింది. అలాగే కంపెనీ చేతిలో నగదు రూ. 13620 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. అయితే ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయి మొత్తం రూ. 2.12 లక్షల కోట్లకు చేరింది. పోస్ట్ పెయిడ్ విభాగంలో కంపెనీ కస్టమర్ల సంఖ్య పెరగడం విశేషం. ప్రస్తుతం వోడాఫోన్ ఖాతాదారుల సంఖ్య 20.5 కోట్లు.