23,816ని కోల్పోతే…
నిఫ్టి ఇవాళ 23,883 పాయింట్ల వద్ద ముగిసింది. రేపు బ్యాంక్ నిఫ్టి వీక్లీ డెరివేటివ్ క్లోజింగ్. ఈ నేపథ్యంలో మార్కెట్ ప్రస్తుత స్థాయిని నిలుపుకుంటుందా? లేదా దిగువకు వెళుతుందా అన్నది కీలకంగా మారింది. నిఫ్టి గనుక మరింత క్షీణించి 23816ని కోల్పోతే మాత్రం మరో 200 లేదా 250 పాయింట్ల పతనం తప్పదని క్యాష్ద ఎకోస్ డాట్‌కామ్‌కు చెందిన టెక్నికల్ అనలిస్ట్ జై బాలా అన్నారు. అంటే 23650 పాయింట్ల వద్ద నిఫ్టికి తదుపరి మద్దతు ఉంటుందన్నమాట. ఒకవేళ అది కూడా కోల్పోతే మాత్రం ఏకంగా 23000కు క్షీణిస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుత స్థాయి లేదా 23600 ప్రాంతంలో నిఫ్టి కోలుకునే ఛాన్స్ అధికంగా ఉంది. అయితే మార్కెట్ ఒక మోస్తరు లాభాలతో కోలుకుంటుందని బాలా అన్నారు. అయితే ఆ పై స్థాయికి కూడా అమ్మడానికేనని… మార్కెట్‌కు పై స్థాయిలో మద్దతు లభించదని ఆయన అన్నారు. స్వల్ప కాలంలో నిఫ్టి బలహీనంగా ఉంటుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కు చెందిన నాగరాజ్ శెట్టి అంటున్నారు. చాలా మంది అనలిస్టులు నిఫ్టి 23600 ప్రాంతానికి వెళ్ళిన తరవాత మళ్ళీ 24000 స్థాయికి వస్తుందని అంటున్నారు.