For Money

Business News

ఒక షేరుకు రెండు షేర్లు ఫ్రీ

వాటాదారుల దగ్గరున్న ప్రతి ఒక షేరుకు రెండు షేర్లు బోనస్‌గా ఇవ్వాలని ఎన్‌ఎండీసీ నిర్ణయించింది. ఇవాళ సమావేశమైన కంపెనీ బోర్డు త్రైమాసిక ఫలితాలతో పాటు బోనస్‌ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. గడచిన 16 ఏళ్ళలో ఎన్‌ఎండీసీ బోనస్‌ ఇవ్వడం ఇదే మొదటిసారి. 2008లో కూడా కంపెనీ ఇన్వెస్టర్ల దగ్గరున్న ఒక షేరుకు రెండు షేర్లను బోనస్‌గా ఇచ్చింది. ఈ మధ్య కాలంలో అంటే 2016, 2019, 2020లో కంపెనీ షేర్లను బైబ్యాక్‌ చేసింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 4949 కోట్ల అమ్మకాలపై రూ. 1211 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాదితో ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ ఆదాయం 22 శాతం, నికర లాభం 18 శాతం పెరిగింది. గడచిన త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.

Leave a Reply