అదరగొట్టిన స్విగ్గీ లిస్టింగ్
ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ (Swiggy) ఐపీఓ మార్కెట్ అంచనాలను తలకిందులు చేసింది. నిన్నటి రోజు కూడా గ్రే మార్కెట్లో జీరో ప్రీమియంతో ఉన్న ఈ ఐపీఓ ఇవాళ సూపర్ ప్రీమియంతో లిస్టయింది. స్విగ్గీ కంపెనీ తన షేర్లను రూ. 390 ధరకు ఇన్వెస్టర్లకు ఆఫర్ చేసింది. రీటైల్ విభాగం కేవలం 1.16 శాతమే సబ్స్క్రయిబ్ అయింది. అంటే దాదాపు దరఖాస్తు చేసినవారందరికీ షేర్లు దక్కాయి. ఇన్వెస్టర్లు ఆసక్తి చూపకపోవడంతో గ్రేమార్కెట్ కూడా ఈ ఆఫర్‌ను పట్టించుకోలేదు. అయితే సెకండరీ మార్కెట్ భారీ నష్టాల్లో ఉన్నా స్విగ్గీ షేర్ రూ. 420 వద్ద ఓపెనైంది. ఆ రతవాత రూ. 391కి పడింది. అంటే కొనేవారికి వారో ఛాన్స్ ఇచ్చింది. లిస్టింగ్‌లో షేర్లు పొందకున్నా… ఇవాళ ఓపెనింగ్‌లో కొనుగోలు చేసిన ఇన్వెస్టర్ల పంట పండింది. ఈ షేర్‌కు క్రమంగా మద్దతు లభించడంతో రూ. 465ల గరిష్ఠ స్థాయిని తాకింది. ఇదే ధర వద్ద అంటే రూ. 464 వద్ద ఈ షేర్ క్లోజైంది. ఇవాళ ఎన్ఎస్ఈలో ఏకంగా 11.29 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. డెలివరీ శాతం కూడా 50 శాతం ఉండటం విశేషం. లిస్టింగ్ రోజే స్విగ్గీ మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్ష కోట్ల రూపాయలను దాటడం విశేషం.