సింగపూర్ నిఫ్టి అప్
అమెరికా వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం తరవాత ఈక్విటీ మార్కెట్లు ప్రస్తుతానికి పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి. అమెరికా ఫ్యూచర్స్ అర శాతం వరకు లాభాల్లో ఉన్నాయి. ఇక ఆసియా మార్కెట్లలో మిశ్రమ స్పందన కన్పిస్తోంది. చైనా, హాంగ్ మార్కెట్లలో పెద్ద మార్పు లేదు. చైనా మార్కెట్లు నామమాత్రపు లాభాల్లో ఉండగా, హాంగ్‌కాంగ్ 0.24 శాతం నష్టంలో ఉంది. జపాన్ నిక్కీ, న్యూజిల్యాండ్ మార్కెట్లు 1.5 శాతంపైగా లాభంతో ఉన్నాయి. ఆస్ట్రేలియా మార్కెట్ లాభం అర శాతానికి పరిమితమైంది. ఫెడ్ నిర్ణయ ప్రభావంపై ఇంకా మదింపు జరుగుతోంది. అమెరికా ఫ్యూచర్స్ అర శాతం మాత్రమే పెరగడం, బాండ్ ఈల్డ్స్‌లో పెద్దగా మార్పు లేకపోవడంతో పాటు డాలర్ మరింత బలపడటంతో ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడి తగ్గుతుందా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. వడ్డీ రేట్లు పెంచినా.. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుందని, మంచి వృద్ధి రేటు సాధిస్తుందని ఫెడ్ ఛైర్మన్ చెప్పడంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 120 డాలర్ల ప్రాంతంలో లాభంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 125 పాయింట్ల లాభంతో ఉంది. సో… నిఫ్టి లాభాల్లో ప్రారంభం కానుంది.