For Money

Business News

అదానీకి సమన్లు జారీ

ఏపీ మాజీ సీఎం జగన్మోహన్‌ రెడ్డికి ముడుపులు ఇచ్చారన్న కేసులో తమ అభిప్రాయం ఏమిటో తెలపాల్సిందిగా అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీకి అమెరికా స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌క మిషన్‌ (SEC) సమన్లు జారీ చేసింది. ఈయనతో పాటు ఆయన సోదరుని కుమారుడు సాగర్‌ అదానీకి సమన్లు జారీ అయ్యాయి. ఈనెల 21వ తేదీన ఈ సమన్లు జారీ అయ్యాయని, అహ్మదాబాద్‌లోని అదానీ నివాసం శాంతివన్‌ పామ్‌ అడ్రస్‌తో ఈసమన్లు జారీ అయినట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. ఇదే నగరంలో సాగర్‌ అదానీ కూడా ఉంటున్నారు. తమ సమన్లకు 21 రోజుల్లో సమాధానం ఇవ్వాలని, లేనిపక్షంలో ఏకపక్షంగా తాము తీర్పు ఇవ్వావల్సి ఉంటుందని సమన్లలో పేర్కొన్నారు. సమన్లు జారీ అయిన తేదీ నుంచి (తీసుకున్న తేదీ నుంచి కాదు) 21 రోజుల్లో ఎస్‌ఈసీకి సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ సమన్లలో అదానీపై ఉన్న అన్ని అభియోగాలను పేర్కొన్నట్లు పీటీఐ పేర్కొంది. ఫెడరల్‌ రూల్స్‌ ఆఫ్‌ సివిల్‌ ప్రొసీజర్స్‌లోని రూల్‌ 12 కింద అదానీకి సమన్లు జారీ చేస్తున్నట్లు కూడా కమిషన్‌ స్పష్టం చేసింది. సోలార్‌ ప్రాజెక్టుల విద్యుత్‌ను సెకీ ద్వారా కొనుగోలు చేసేందుకు ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డికి రూ. 1750 కోట్ల లంచం ఇచ్చినట్లు/ ఇవ్వజూపినట్లు అమెరికా న్యాయశాఖ, SEC అభియోగాలు నమోదు చేశాయి.

Leave a Reply