For Money

Business News

రేపే ఆఫర్‌ ఫర్‌ సేల్‌

హిందుస్థాన్‌ జింక్‌ ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రేపు ఓపెన్‌ కానుంది. ఈ కంపెనీలో తనకున్న వాటాలో 2.5 శాతం వరకు వాటాను కేంద్రం ఆఫర్‌ చేయనుంది. వాస్తవానికి ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద 1.25 శాతం వాటా అంటే 5.28 కోట్ల షేర్లను కేంద్రం అమ్ముతుంది. ఇన్వెస్టర్ల నుంచి ఓవర్‌ సబ్‌స్క్రిప్షన్‌ వచ్చే పక్షంలో మరో 1.25 శాతం షేర్లను అమ్ముతుంది. ఆఫర్‌ ధర రూ. 502. అంటే ప్రస్తుత మార్కెట్‌ ధరకు పది శాతం డిస్కౌంట్‌కు కేంద్రం ఈ షేర్లను ఆఫర్‌ చేయనుంది. ఈ ఆగస్టులో కంపెనీ ప్రమోటర్‌ వేదాంత గ్రూప్‌ కూడా ఓఎఫ్‌ఎస్‌ కింద షేర్లను అమ్మింది. షేర్‌ ధర మార్కెట్‌లో రూ.572 ఉండగా, ఏకంగా 15 శాతం డిస్కౌంట్‌తో రూ. 486లకు షేర్లను అమ్మిది. ఆ సమయంలో కంపెనీ షేర్‌ కేవలం నాలుగు సెషన్స్‌లో 20 శాతం క్షీణించింది. అక్కడి నుంచి కోలుకుని హిందుస్థాన్‌ జింక్‌ షేర్‌ ఇవాళ రూ. 559.5 వద్ద ముగిసింది. ఇపుడు మళ్ళీ ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పైగా పది శాతం డిస్కౌంట్‌తో అమ్ముతుండటంతో…ఈ షేర్‌ ఎక్కడ దాకా పతనం అవుతుందో.. మెటల్‌ షేర్లకు గిరాకీ పెరుగుతున్న సమయంలో ఈ ఆఫర్‌ రావడం విశేషం.