For Money

Business News

NIFTY TODAY: అధిక స్థాయిలో ఒత్తిడి

మార్కెట్‌ ఇవాళ పాజటివ్‌గా ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు15,692. రాత్రి 0.75 శాతం వడ్డీ రేట్లను పెంచిన అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ వచ్చే నెల మళ్ళీ 0.75 శాతం వరకు వడ్డీ రేట్లను పెంచుతామని స్పష్టం చేసింది. దీంతో ఈక్విటీ మార్కెట్లు స్వల్ప కాలానికి పెరిగినా… మున్ముందు కష్టాలు తప్పవని తేలిపోయింది. ఇక ఇవాళ్టి ట్రేడింగ్‌ విషయానికొస్తే నిఫ్టికి 16750 ప్రాంతంలో ఒత్తిడి ఖాయంగా కన్పిస్తోంది.ఈ స్థాయిని ఓపెనింగ్‌లో దాటినా తరవాత నిలబడుతుందా అన్నది చూడాలి. నిఫ్టి 15765పైన స్థిరంగా సాగితేనే లాభాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

నిఫ్టికి ఇవాళ్టి లెవల్స్‌…

అప్‌ బ్రేకౌట్‌ – 15765
రెండో ప్రతిఘటన – 15748
తొలి ప్రతిఘటన – 15737
నిఫ్టికి కీలకం – 15718
తొలి మద్దతు – 15648
రెండో మద్దతు – 15636
డౌన్‌ బ్రేకౌట్‌ – 15619