For Money

Business News

అమ్మేవాళ్ళే… కొనే మొనగాడేడీ…

ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయానికి వాల్‌స్ట్రీట్‌ కకావికలమైంది. ఉదయం ఆసియాతో మొదలు… తరవాత యూరో … ఇపుడు వాల్‌స్ట్రీట్‌… ఈక్విటీ మార్కెట్లన్నీ కుప్పకూలాయి. గత అయిదు రోజులుగా పడుతూ వస్తున్న వాల్‌స్ట్రీన్‌ నిన్ననే ఒక మోస్తరు లాభాలతో ముగిసింది. ఇవాళ మళ్ళీ చితక్కొట్టుడే. నాస్‌డాక్‌ నాలుగు శాతంపైగా క్షీణించిందంటే… ఐటీ, టెక్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎంతుందో… నాస్‌డాక్‌ ఎపుడో బేర్‌ ఫేజ్‌లోకి వచ్చేసింది. కాని వరుసగా ఈస్థాయి పతనం చూస్తుంటే గరిష్ఠ స్థాయి నుంచి నిఫ్టి పతనం 40 శాతానికి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా 3.22 శాతం క్షీణించింది. ఇపుడు 3656 వద్ద ట్రేడవుతోంది. మరో 150 పాయింట్లు పడుతుందని విశ్లేషకుల అంచనా. ఇక డౌజోన్స్‌ పరిస్థితి ఇలానే ఉంది. 2.4 శాతం నష్టంతో ఈ సూచీ ట్రేడవుతోంది. డాలర్‌ ఇండెక్స్‌ ఇవాళ ఒక శాతం పైన నష్టపోయినా…103.7 వద్ద ట్రేడవుతోంది. ఇక క్రూడ్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. పదేళ్ళ ప్రభుత్వ బాండ్స్‌ ఈల్డ్‌లో స్వల్ప మార్పు వచ్చినా.. ఈల్డ్స్‌ ఇంకా 3.34 శాతంపైనే ఉన్నాయి.