For Money

Business News

స్విస్‌ బ్యాంకుల్లో మనవాళ్ళ సొమ్ము 50 శాతం పెరిగింది

తాము అధికారంలోకి వస్తే విదేశాల్లో దాగి ఉన్న నల్లధనం మన దేశానికి తీసుకువస్తామని… ఒక్కొక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు జమ చేస్తామని ప్రధాని మోడీ ఎన్నికల సమయంలో హామి ఇచ్చారు. అక్కడి నుంచి తేవడమేమోగాని… తాజా సమాచారం మేరకు స్విస్‌ బ్యాంకుల్లో మన వాళ్ళ నిధులు గత ఏడాదితో పోలిస్తే 50 శాతం పెరిగి రూ. 30,000 కోట్లకు చేరాయి. ఇది నికార్సుగా మన భారతీయుల పేర్లతో ఉన్న ఖాతాల్లోని సొమ్ము. మరి బినామీల పేరుతో ఎంత ఉందో? ఇవాళ స్విస్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ వెల్లడించిన డేటా ప్రకారం స్విస్‌ బ్యాంకుల్లో భారతీయులు నిధులు 383 కోట్ల స్విస్‌ ఫ్రాంక్‌లకు చేరింది. అంటే సుమారు రూ. 30500 కోట్లకు సమానం. ఇది 14 ఏళ్ళ గరిష్ఠ స్థాయి. ఈ మొత్తం డిపాజిట్లు, సెక్యూరిటీలు, ఇతర సాధనాల రూపంలో ఉన్నట్లు స్విస్ సెంట్రల్‌ బ్యాంక్‌ వెల్లడించింది. 2020 చివరి నాటికి భారతీయులు పేరుతో ఉన్న మొత్తం రూ. 20700 కోట్లు. అంటే ఈ ఏడాదికి 50 శాతం పైగా పెరిగిందన్నమాట.