మాంద్యం భయంతో అమ్మకాల జోరు
వాల్‌స్ట్రీట్ భారీ నష్టాలతో ముగిసింది.వడ్డీ రేట్లను ఈ స్థాయిలో పెంచుతున్న ఫెడరల్ రిజర్వ్ మాంద్యంలో ఆర్థిక వ్యవస్థ పోకుండా కాపడలేదని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. మాంద్యం ఖాయమని టాక్ మార్కెట్‌లో వ్యాపించింది. దీంతో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. డౌజోన్స్ 30,000 స్థాయి దిగువకు వచ్చింది. డౌజోన్స్ 2.4 శాతం, నాస్‌డాక్ 4.1 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 3.2 శాతం క్షీణించాయి. నిన్నటి భారీ అమ్మకాల్లో టెస్లా పది శాతం క్షీణించగా ఫేస్‌బుక్,యాపిల్, అమెజాన్ షేర్లు నాలుగు శాతంపైగా నష్టపోయాయి.ఈ ఏడాది ద్రవ్యోల్బణం 4.3 శాతానికి చేరుతుందని, వచ్చే ఏడాది 3 శాతానికి పడుతుందని మోర్గాన్ స్టాన్లీ అంటోంది. ప్రస్తుతం అమెరికా ద్రవ్యోల్బణం 8.6 శాతం. వడ్డీ రేట్ల పెంపు ప్రభావం అపుడే అమెరికా ఆర్థిక వ్యవస్థపై కన్పిస్తోంది. మార్టిగేట్ రేట్లు భారీగా పెరగడంతో హౌసింగ్ మార్కెట్ 13 నెలల కనిష్ఠానికి చేరింది.