27న బజాజ్ ఆటో బోర్డు భేటీ?
బజాజ్ ఆటో గవర్నింగ్ బోర్డు ఈ నెల 27వ తేదీన భేటీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈనెల 14వ తేదీన భేటీ అయిన కంపెనీ బోర్డు షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనను వాయిదా వేసింది. ఈ ప్రతిపాదనపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని బోర్డు అభిప్రాయపడింది. ఇదే అంశాన్ని పరిశీలించేందుకు బోర్డు ఈనెల 27వ తేదీన సమావేశం కానున్నట్లు కంపెనీ వర్గాలను పేర్కొంటూ సీఎన్‌బీసీ టీవీ18 పేర్కొంది. బజాజ్ ఆటో షేర్ ఇవాళ ఎన్‌ఎస్‌ఈలో 1.3 శాతం నష్టంతో రూ. 3650 వద్ద ముగిసింది.